హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి
శాంతినగర్: హిందూ ధర్మం ఎంతో ప్రాచీనమైనదని, మతాల మధ్య విద్వేశాలు అవసరంలేదని, మతమార్పిడి దుశ్చర్య అని, మత మార్పిడులు తగవని.. హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని పలువురు పిలుపునిచ్చారు. హిందూ చైతన్య రథయాత్రకు వడ్డేపల్లి మున్సిపాలిటీ, మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం ఘనస్వాగతం పలికారు. మొదట వడ్డేపల్లి మండల పరిధిలోని జూలెకల్ చేరుకుంది. అనంతరం శాంతినగర్ పట్టణంలోని మారుతీనగర్ ఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద రథయాత్రకు భాజాభజంత్రీలతో స్వాగతం పలకారు. పట్టణంలోని అలంపూర్–రాయచూర్ ప్రధాన రహదారి నుండి జమ్ములమడుగులోని దత్తాత్రేయస్వామివారి ఆలయం, రామాలయం వీధులగుండా రథయాత్ర కొనసాగింది. ఈసందర్బంగా జై శ్రీరామ్ అంటూ భక్తులు నినాదాలు చేస్తూ రథయాత్రలో పాల్గొన్నారు. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, హిందూ ధర్మం మతం కాదని.. జీవన విధానమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వడ్డేపల్లి మున్సిపాలిటీ, జూలేకల్ యువకులు శేఖర్, గోపాల్, వెంకట్, దామోదర్, శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment