విస్తృత అవగాహన
జిల్లాలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రం భవనాన్ని ఈ నెల 12వ తేదీన కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు ప్రారంభించారు. ఈ భరోసా కేంద్ర నిర్వాహకులు మహిళల రక్షణ కోసం షీ టీం బృందాలను ఏర్పాటు చేసి బస్టాండ్, ప్రార్థన మందిరాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలలో అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించినా, అనుచితంగా వాఖ్యలు చేసిన వెంటనే షీ టీం సభ్యులకు సమాచారం ఇవ్వడంతో రక్షణగా నిలుస్తున్నారు. మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేసేలా మనోఽధైర్యాన్ని అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో డయల్ 100, 6303923257కు ఫోన్ చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక మాద్యమాల ద్వారా ఫిర్యాదు చేసేలా శ్రీకారం చుట్టారు. బాల్య వివాహాలు చేస్తున్న క్రమంలో 1098కు కాల్ చేయల్సిందిగా సిబ్బంది వివరిస్తున్నారు. యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ యూనిట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. మైనర్లపై వేధింపులకు పాల్పడిన వారిపై పోక్సో చట్టం ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment