మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
అలంపూర్ రూరల్: విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి మిథున్‌తేజ సూచించారు. అలంపూర్ మండలంలోని బుక్కాపూరం జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా.. జడ్జి హాజరై మాట్లాడారు. విద్యార్థులు సైతం చట్టాలపై అవగహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్ బాలికలకు వివాహాలు చేయరాదని అలా చేస్తే చట్ట పరమైన చర్యలు చేపడతామని అన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, షీటీమ్‌లను సంప్రదించాలన్నారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రతి వ్యక్తి సమాజంలో ఎలా బతకాలో సూచింపబడిందని తెలిపారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు మలిపెద్ది సురేష్‌కుమార్ శేట్టి, న్యాయవాదులు తిమ్మరెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాగరాజ్‌యాదవ్, గజేంధర్‌గౌడ్, ఆంజనేయులు, హెచ్‌ఎమ్ బాలాజీ కృష్ణకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment