ప్రజా విజయోత్సవాలు జయప్రదం చేయాలి
గద్వాల: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈ నెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతుపండగ, రైతు అవగాహన కార్యక్రమాలకు జిల్లా నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈనెల 29, 30వ తేదీలలో మహబూబ్‌నగర్‌లో రైతు అవగాహన, రైతు పండుగ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు, ఇందులో వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలకు సంబంధించి ఆవిష్కరణలు, యాంత్రీకరణ, విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు వంటి అన్ని రకాల వ్యవసాయ అంశాలపై రైతులకు శిక్షణతో పాటు అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమాలకు జిల్లా నుంచి రైతులను అధికసంఖ్యలో తరలించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీవోలు, ఏవోలు, ఏపీఎంలు ఆయా మండలాల పరిధిలో క్లస్టర్ల వారిగా రైతుల జాబితను సిద్ధం చేసి వారిని సకాలంలో కార్యక్రమాలకు తరలించాలన్నారు. అదేవిధంగా రైతులకు భోజనవసతి, తాగునీరు, రవాణ సౌకర్యం వంటివి ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా డేటా ఎంట్రీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వే ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్ తప్పులకు తావులేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. సమగ్ర సర్వేలో అందుబాటులో లేని కుటుంబాలు డోర్‌లాక్, వలసలు వెళ్లడం, అందుబాటులో లేకపోవడం వంటి వారిని గుర్తించి వారి సెల్‌నంబర్లు సేకరించి ఫోన్‌ద్వారా వారి నుంచి వివరాలు సేకరించాలన్నారు. నిర్దిష్ట సమయంలో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి
కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద సేకరించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను వెంటనే చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం వెంటనే రైస్‌మిల్లులకు తరలించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీఎస్‌వో స్వామికుమార్, డీఎస్‌వో విమల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment