విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
గద్వాల: ప్రతి విద్యార్థి బాల్య దశ నుంచే శాసీ్త్రయ దృక్పథం, పరిశీలన అలవర్చుకొని శాస్త్రరంగంలో రాణంచాలని ఇన్‌చార్జి డీఈఓ కాంతమ్మ సూచించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెకిముకి పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా గురువారం స్థానిక బాలభవన్‌లో ఏర్పాటుచేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్ర మానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవస్థీకృతమైన ప్రాంతాల్లో జ్ఞానాన్ని ప్రసాదించేది విజ్ఞానశాస్త్రమని వివరించారు. మన జీవన విధానం, అభివృద్ధి, సైన్స్‌తో ముడిపడి ఉందని చెప్పారు. శాసీ్త్రయంగా ఆలోచించే ప్రతి వ్యక్తి శాస్త్రవేత్తే అని పేర్కొన్నారు. డీఐఈఓ హృదయరాజు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞాన శాస్త్రంపై పట్టు సాధించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులలో శాసీ్త్రయ నైపుణ్యాలను పెంపొందించాలన్నారు.
ఇన్‌చార్జ్ డీఈఓ కాంతమ్మ
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment