మున్సిపల్ సమావేశం రసాభాస
అయిజ: తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడంలేదని కొందరు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు తమ వార్డులకు అసలు నిధులే మంజూరు చేయడంలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా మున్సిపల్ చైర్మన్, వివిధ వార్డుల కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవడంతో గురువారం అయిజ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఏఈ రాజశేఖర్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రారంభమైన మొదట్లోనే ఈ విషయమై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు మహిళా కౌన్సిలర్లతోపాటు వారి భర్తలతోపాటు బంధువులు సమావేశానికి హాజరవడంతో గొడవ మరింత రాజుకుంది. ఈ విషయాలు ఏవీ మీడియా కంటబడకుండా సమావేశం నిర్వహించే గది తలుపులు మూసివేయించారు.
తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేయట్లేదని కౌన్సిలర్ల ఆగ్రహం
చైర్మన్తో తీవ్రస్థాయిలో వాగ్వాదం
Comments
Please login to add a commentAdd a comment