కేసుల్లో పురోగతి సాధించాలి
గద్వాల క్రైం: పెండింగ్ కేసుల పరిష్కారంలో పురోగతి సాధించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెండింగ్ కేసుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం తగదన్నారు. బాధితులతో సమన్వయం, నిస్పక్షపాతంగా మాట్లాడి వీలైనంత త్వరగా న్యాయం అందేలా చూడాలన్నారు. మత్తు పదార్థాలు, నిషేధిత కల్లు, మద్యం, నగదు, గంజాయి, కొకై న్, తదితర పదార్థాల సరాఫరా వంటి అంశాలపై నిఘా ఉంచాలన్నారు. దొంగతనాల కేసుల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి నేరస్తులను నిలువరించాలన్నారు.
నేరాల నియంత్రణకు డ్రోన్ల వినియోగం ..
జిల్లాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సభలు, జాతరలు, రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. రాత్రి సమయాల్లో సైతం అనుమానితులను గుర్తించేందుకు దోహద పడుతుందన్నారు. దాదాపు 5 కిలో మీటర్లు నుంచి 15 కిలోమీటర్ల వరకు అనుమానితుల కదలికలను గుర్తించడం జరుగుతుందన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రసంశా పత్రాలను అందజేశారు. ఏఎస్పీ గుణశేఖర్, డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment