కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఫైళ్లను పరిశీలించారు. ఎంత మేరకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. నిబంధనల ప్రకారమే మంజూరయ్యాయా? లేదా? వంటి అంశాలపై ఆరా తీశారు. అందుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీపై టీడీపీ రాద్దాంతం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఈ చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment