ఉన్నత విద్యపై నిర్లక్ష్యం
కేవలం రూ.2,326 కోట్లు కేటాయించడం ద్వారా ఉన్నత విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కొరవడిన నేపథ్యంలో ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. జీతాలకు మాత్రమే సరిపోయేలా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎంత విడుదల చేస్తారో, వసతి దీవెన బకాయిలను ఎంత ఇస్తారో, తల్లికి వందనం పథకం కింద ఎంత కేటాయిస్తారో స్పష్టత లేదు.
– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
చంద్రబాబును పొగడడానికే బడ్జెట్
బడ్జెట్ ఆత్మస్తుతి, పరనిందలా ఉంది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో సీఎంను పొగడడానికే ఎక్కువ సమయం కేటాయించడం శోచనీయం. ప్రభుత్వ హామీల అమలుపై స్పష్టత కొరవడింది. నిరుద్యోగులకు ఉపాధి, నిరుద్యోగ భృతి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి.
– పలివెల వీరబాబు, సీపీఎం నేత, ఇంద్రపాలెం
మరింతగా కేటాయించాలి
బడ్జెట్‌లో విద్యారంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తే బాగుండేది. తక్కువ కేటాయింపులతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించలేరు. దీంతో విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంది.
– డాక్టర్ కె.యమున, లెక్చరర్, ఏఎస్‌డీ
ప్రభుత్వ కళాశాల, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment