ఏలేరుకు మొండిచెయ్యి
రాష్ట్ర బడ్జెట్‌లో ఏలేరు ప్రాజెక్ట్‌కు మొండిచెయ్యి చూపించడం దారుణం. ఇప్పటికే ఆధునీకరణ పనులు చేపట్టక ఈ ప్రాజెక్ట్ శిథిల స్థితికి చేరింది. ఇది పేదల బడ్జెట్ కాదు. కార్పొరేట్ల బడ్జెట్‌లా ఉంది.
– ఏగుపాటి అర్జునరావు,
జిల్లా కార్యదర్శి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్
సంక్షేమ రంగాన్ని విస్మరించారు
బడ్జెట్ అంటే గత ప్రభుత్వం హయాంలో తప్పులు వెతకడం కాదు. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగాన్ని విస్మరించింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు తగ్గించారు. కేటాయింపులు లేవు. ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రి పొగడడం తప్ప బడ్జెట్‌లో కొత్తదనం లేదు. అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి పొందామని చెప్పి, ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు అనే విషయాన్ని దాచిపెట్టారు. మొత్తం మీద బడ్జెట్ ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించింది.
– తాటిపాక మధు, సీపీఐ నేత
Comments
Please login to add a commentAdd a comment