ప్రేమ విఫలమై యువకుడు.. | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడు..

Published Tue, May 7 2024 11:00 AM

-

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురై డొంకేశ్వర్‌ మండలం నికాల్‌పూర్‌ గ్రామానికి చెందిన పాస్క శ్రీకాంత్‌(24) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వి వరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాంత్‌ ఐదేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ప్రేమ విఫలం కావడంతో గత కొన్ని రోజులుగా మానసికంగా బాధపడుతూ ఈ నెల 5వ తేదీన ఉదయం పొలం వద్ద గడ్డిమందును తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌ను నందిపేట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి తండ్రి పెంటన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌ తెలిపారు. కలుపు గోలుగా ఉండే శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement