ప్రజల దాహం తీరుస్తున్నా | Sakshi
Sakshi News home page

ప్రజల దాహం తీరుస్తున్నా

Published Tue, May 7 2024 11:05 AM

ప్రజల దాహం తీరుస్తున్నా

లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో ఎక్కడ తాగునీటి కొరత ఉన్నా అక్కడ బోరు బావులు తవ్వించి ప్రజల దాహం తీరుస్తున్నానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు అన్నారు. సోమవారం లింగంపేట, మెంగారం, బోనాల్‌, బోనాల్‌తండా, బాయంపల్లి, బాణాపూర్‌, బాణాపూర్‌తండా, కొర్పోల్‌, నాగారం, నల్లమడుగు, నల్లమడుగుతండా, లింగంపల్లి(ఖుర్దు) తదితర గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతి గుర్తుకు ఓటేసి సురేశ్‌ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ వేసవిలో గ్రామాల్లో 250 బోరు బావులు వేసి తాగునీరు అందించానన్నారు. బీజేపీ నేతల మాయమాటలు నమ్మవద్దన్నారు. బీబీ పాటిల్‌ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పింఛన్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. మండల కేంద్రంలో 983 సర్వే నంబర్‌లో వందలాది రైతుల భూములు వివాదంలో ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించే బాధ్యత నాదన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటరు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి నుంచి బీదర్‌ వరకు రైల్వే లైన్‌, లింగంపేట మండల కేంద్రంలో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నారాగౌడ్‌, రాజు, సంతోష్‌రెడ్డి, ఫతియోద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

అంబలి కేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలోని గాంధీ చౌక్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సోమవారం ప్రారంభించారు. 21 సంవత్సరాలుగా ప్రతిఏటా వేసవిలో అంబలి కేంద్రాన్ని నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు సాయిబాబా, తదితరులున్నారు.

బీజేపీకి ఓటేసి ఆగం కావద్దు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు

 
Advertisement
 
Advertisement