అర్హులందరికి ఇందిరమ్మ గృహాలు | Sakshi
Sakshi News home page

అర్హులందరికి ఇందిరమ్మ గృహాలు

Published Tue, May 7 2024 11:05 AM

అర్హు

నిజాంసాగర్‌(జుక్కల్‌): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, లోక్‌సభ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి సాధిస్తారన్నారు. సోమవారం మండలంలోని సుల్తాన్‌న్‌నగర్‌, బంజపల్లి, అచ్చంపేట, ఆరేడ్‌, బ్రాహ్మణపల్లి, వెల్గనూర్‌, మంగ్లూర్‌, నర్సింగ్‌రావ్‌పల్లి, మాగి, ఒడ్డేపల్లి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారంగా గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతుందని చెప్పారు. ఆగస్టు 15లోగా మిగితా హామీలను అమలు చేసి తీరుతుందన్నారు. సురేశ్‌ షెట్కార్‌ను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌, నాయకులు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, జయప్రదీప్‌, మల్లికార్జున్‌, రవీందర్‌రెడ్డి ఉన్నారు.

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

పిట్లం(జుక్కల్‌): రాంపూర్‌ జీపీ కార్యాలయం వద్ద సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మందాడి బలరాం రెడ్డి మాట్లాడుతూ.. జొన్న కొనుగోళ్ల పరిమితిని ఎకరానికి 8.85 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాల్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. నాయకులు మైసయ్య, లక్ష్మారెడ్డి, గుంట హనుమాండ్లు, జంబిరెడ్డి, తదితరులున్నారు.

జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

అర్హులందరికి ఇందిరమ్మ గృహాలు
1/1

అర్హులందరికి ఇందిరమ్మ గృహాలు

 
Advertisement
 
Advertisement