అర్హులకు దసరాకు డబుల్ ఇళ్లు
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : అర్హులందరికీ దసరాకు డబుల్ ఇళ్లు అందజేస్తామని, పార్టీలో పని చేసిన వారి కే పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మర్కల్ స్టేజీ వద్ద అశోక్ గార్డెన్స్‌లో సదాశివనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి, చైర్మన్ సంగ్యా నాయక్‌కు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం చేప ట్టారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను సన్మానించారు. అశోక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరాకు నిరుపేదలకు డబుల్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. త్వరలో నూతన గ్రామ, మండల కమిటిలను ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో సైనికుల్లా పని చేసి పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలన్నారు. అనంతరం మర్కల్ స్టేజీ వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి గంగు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొంబోతుల లింగాగౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రేస్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీలు గాదారి శ్రీనివాస్ రెడ్డి, రూపెందర్ రెడ్డి, మాజీ మండల కో–ఆప్షన్ ఇర్షాదొద్దిన్, విండో చైర్మన్లు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment