బాల్కొండ: సాధారణంగా పాడి పశువులు అల్ప ఉష్ణోగ్రతలతో అసౌకర్యానికి గురవుతుంటాయి. వాటి పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాల్కొండ పశు వైద్యాధికారి గౌతంరాజు పలు సూచనలు, సలహాలు చేశారు. శీతకాలంలో పాడి పశువుల శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తుంటాయని, వాటి జీర్ణవ్యవస్థ మందగించి ఆహారం సక్రమంగా తీసుకోకపోవడంతో శరీరంలో పోషక పదార్థాలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. దీని మూలంగా శీతకాలంలో పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుందన్నారు. దీనిని అధిగమించడానికి క్రింద పేర్కొన్న సూచనలు పాటించాలన్నారు.
● పాడి పశువులకు అనుకూలంగా ఉండే సరైన వసతి కల్పించాలి.
● వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రత కంటే పాకలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండేలా ఏర్పాటు చేయాలి.
● పరాన్న జీవుల నిరోధక చర్యలు చేపట్టాలి. అల్బెండజోల్ వాడి జీర్ణవ్యవస్థ ప్రక్రియ మందగించకుండా చూడాలి.
● శీతకాలపు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. పాడి పశువులకిచ్చే సమీకృత ఆహారంలో ఫాస్పెట్ సమృద్ధిగా లభించే గోధుమ, తవుడు కలిపి తయారు చేసిన దాణాను వాడాలి.
● చలి కాలంలో అల్ప ఉష్ణోగ్రతల వలన నిమోకై క సూక్ష్మ జీవులు ఊపిరితిత్తులపై ప్రభావం చూపి శ్వాసకోశ వ్యాధులకు గురి చేస్తుంటాయి. దీంతో ఊపిరితిత్తులు, పొరవాపుకు గురవుతాయి. దీని వలన శ్వాస క్రియలో మార్పులు వచ్చి వ్యాధి సోకిన పశువుల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో వ్యాధి నిరోధక మందులైన యాంటీ బయోటిక్ పౌడర్‌ను దాణాలో కలిపి ఇవ్వాలి.
● రాత్రి వేళల్లో పశువులను షెడ్లలోనే ఉంచి చు ట్టూరుగా గోనె సంచులను వేలాడదీయాలి.
● పాకలలో నేలపై రాత్రి పూట వరి గడ్డిని పరిచి వెచ్చదనాన్ని కల్పించాలి. షెడ్లలో ఉష్ణోగ్రతను పెంచేందుకు రూమ్ హీటర్లను అమర్చాలి. ఈ విధంగా చేపడితే శీతాకాలంలో పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. దీంతో రైతు నష్ట పోకుండా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment