మహిమాన్వితం పాదరస లింగం
కాశీలో సంకల్పం..
ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక సేవలో తరించారు అంక్సాపూర్‌కు చెందిన విఠల్ మహారాజ్. 1978లో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో శ్రీదత్తాశ్రమాన్ని స్థాపించి భక్తులకు జ్ఞానభోద చేస్తూ ఉన్న విఠల్ మహారాజ్ వారణాసి(కాశీ)కి వెళ్లి అక్కడ ధ్యానం, మౌన దీక్ష నిర్వహించేవారు. అలా 2003కు ముందు 41 రోజుల మౌన దీక్షకు ఉపక్రమించిన ఆయనకు పాదరస లింగాన్ని ప్రతిష్ఠించాలనే సంకల్పం కలిగింది.
మోర్తాడ్(బాల్కొండ): శివాలయాల్లో ఎక్కడైనా పా లరాతితో లేదా నల్లరాయిని చెక్కి లింగాన్ని ప్రతిష్ఠి చడం సాంప్రదాయంగా వస్తుంది. కానీ అన్నింటికన్నా భిన్నమైన పాదరసంతో లింగాన్ని ప్రతిష్ఠించడం దేశంలో రెండు చోట్లనే జరిగింది. ఒకటి పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో, మరోటి వేల్పూర్ మండలం అంక్సాపూర్‌లో నెలకొని ఉంది. జరజర జారిపోయే పాదరసంను ఒడిసిపట్టడం అంటే రసశాస్త్రంపై పూర్తిగా పట్టు ఉన్నవారికే సాధ్యం. అలాంటి పాదరసంతో శివలింగాన్ని ఏర్పాటు చేసి, ప్రతిష్ఠ్ఠి ంచడం ఎంతో గొప్ప విషయం.
ఎన్నో ప్రత్యేకతలు..
హరిద్వార్‌లో 101 కిలోల పాదరసంతో లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠిస్తే ఇక్కడి లింగానికి 411 కిలోల పాదరసం పట్టింది. మొదట్లో 50 కిలోల పాదరసంతోనే లింగంను తయారు చేయాలని ఆలోచన చేశారు. కానీ లింగం పరిమాణం ఎక్కువ గా ఉండటంతో ఎక్కువ పాదరసం అవసరమైంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించడానికి ముందు ఆలయంలో 12 ఫీట్ల అఖండంను ఏర్పాటు చేశారు. రాయిని కింద ఉంచి లింగాన్ని ప్రతిష్ఠించడానికి శిల్పులతో ప్రత్యేకంగా అఖండంను తయారు చేయించారు. దానిపై లింగాన్ని ప్రతిష్ఠించి హంపీ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యులు, పుష్పగిరి కాశీ చంద్రశేఖర పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్ర మం వైభవంగా నిర్వహించారు. 411 కిలోల పాద రస లింగంకు చుట్టూ ఒక్కో కిలో పాదరసంతో చేసి న 108 చిన్న లింగాలను ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకత. 2004లో పాదరస లింగంను ప్రతిష్ఠించి నిర్విరామంగా పూజలు చేసిన విఠల్ మహరాజ్ 2010లో వృద్ధాప్య సమస్యలతో శివకై ్యం చెందారు. ఇప్పుడు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను ఆయన కొడుకు జగత్ మహరాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు శ్రావణ, కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇక్కడి పాదరస లింగాన్ని దర్శించుకోవడానికి పొరుగు రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు పాదరస లింగాన్ని దర్శించుకుంటారు.
మొట్టమొదటగా హరిద్వార్‌లో ఏర్పాటు
రెండోది అంక్సాపూర్‌లో దత్తాశ్రమ
వ్యవస్థాపకుడు విఠల్ మహారాజ్
ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన
దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు
పాదరస లింగాన్ని దర్శించుకోవడానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్ని సౌకర్యాలను ఆశ్రమ నిర్వాహకులు కల్పిస్తున్నారు. పండుగలు, ప్రత్యేక రోజులలో శివభక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన పాదరస లింగం దేశంలోనే రెండోది కావడం గర్వకారణం.
– మల్లయ్య, భక్తుడు, అంక్సాపూర్
అంక్సాపూర్ పేరు ఎంతో మందికి తెలిసింది
అంక్సాపూర్ అంటే పచ్చని పంటలు అని కొందరికి గు ర్తు. కానీ పాదరస లింగంతో ఎంతో మందికి ఈ గ్రామం ప్రత్యేకత తెలిసి వచ్చింది. రాయి, పాలరాతితో చేసిన లింగాన్ని ఎక్కడైనా చూస్తాం. పాదరసంతో త యారు చేసిన ప్రత్యేక లింగం ఇక్కడ ప్రతిష్ఠించడంతో అంక్సాపూర్ ఖ్యాతీ ఎంతో విస్తరించింది. మాకు చాలా సంతోషంగా ఉంది.
– దేగాం రాములు, అంక్సాపూర్
Comments
Please login to add a commentAdd a comment