పడకేసిన పంచాయతీ పాలన
నిజాంసాగర్ : మండలంలోని పలు గ్రామాల్లో పా లన పడకేసింది. రోడ్లపై ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కాగితాలు, చెత్తాచెదారం, మురికి కూపాలుగా కా లువలు, పైపులైన్ల లీకేజీలు, ఆవాస ప్రాంతాల చు ట్టూ పిచ్చి మొక్కలతో గ్రామ పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. అధికారులు జీపీలపై వైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రల్లె ప్రగతి కో సం సరఫరా చేసిన ట్రాక్టర్లు మూలకు పడటం, పల్లె ప్రకృతి వనాలకు నీటి సరఫరా లేకపోవడంతో వనాలు కళావిహీనంగా మారుతున్నాయి.
రోడ్లపై చెత్త, పైపులైన్ల లీకేజీలు
నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి జీపీలో ట్రాక్టర్ మూలన పడడంతో చెత్తసేకరణ జరగడం లేదు. అంతేకాకుండా జీపీలోని రోడ్లపై పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో లీకేజీలు దర్శమనిస్తున్నాయి. మహమ్మద్‌నగర్ మండలంలోని ముగ్దుంపూర్ జీపీలో పైపులైన్ల లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఆరేపల్లి జీపీలో రక్షిత మంచినీటి ట్యాంకు ద్వారా సరఫరా అవుతున్న నీరు రంగుమారి వస్తున్నాయంటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూలనపడ్డ ట్రాక్టర్లు
జిల్లాలో 526 జీపీలకు గత ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లను సరఫరా చేసింది. పల్లె ప్రగతికి జీ పీలకు సరఫరా చేసిన ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలింపు, హరిత వనాలకు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాకు ఉపయోగించాల్సి ఉంది. ట్రాక్టర్లు వచ్చిన ఏడాది పాటు గ్రామాల్లో చెత్త తరలింపు, పారిశుధ్య ప నులు జోరుగా సాగాయి. అయితే జీపీల్లో సర్పంచుల పదవి కాలం ముగియడంతో పల్లె ప్రగతి పనుల జాడ కరువైంది. అంతేకాకుండా జీపీలకు ప్రభుత్వపరంగా నిధులు రాకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనతో పల్లెల పరిస్థితి అధ్వానంగా మారింది.
కొరవడిన పారిశుధ్య పనుల పర్యవేక్షణ
పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితం
చెత్త ట్రాక్టర్ అస్తలేదు
మా గ్రామానికి చెత్త ట్రాక్టర్ రావడం లేదు. దీంతో ఇళ్లు, రోడ్డుపై ఊడ్చిన చెత్తను ఇంటి ఎదుట కాలబెడుతున్నాం. పైపులైన్లు లీకేజీ కావడంతో రోడ్లు బురదమయంగా మారుతోంది. లీకేజీలను ఎవరూ పట్టించుకోవడం లేదు. – గంగవ్వ, బ్రాహ్మణపల్లి
Comments
Please login to add a commentAdd a comment