నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి
కామారెడ్డి క్రైం : వేగంగా వెళ్లినా వాహనాన్ని నియంత్రించగలనన్న అతి విశ్వాసం.. హెల్మెట్/సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం.. ఎంత తాగినా స్టెడీగా బండి నడపగలనన్న నమ్మకం.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రమాదమని తెలిసినా వాహనదారులు చేస్తున్న తప్పిదాలతో జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి. జిల్లాలో ఇటీవల జరిగిన పలు ప్రమాదాలను గమనిస్తే డ్రంకన్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ చేయని ప్రయత్నం లేదు. అయినా నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువగా యువకులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
రోజుకో చోట..
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ చివరినాటికి 450 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 241 మంది మృత్యువాత పడగా.. 412 మంది గాయాలపాలయ్యారు. ఎక్కడ ప్రమాదం జరిగినా దానికి అతివేగం, నిరక్ష్యం, డ్రంకన్ డ్రైవ్‌లే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. యువకులు, చిన్నపిల్లలు ఉన్న తండ్రులు, కుటుంబాలను పోషించే వారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం గానీ, తీవ్ర గాయాలపాలవడం గానీ జరిగినప్పుడు బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వైద్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మరికొందరికి లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు నిలవడం లేదు.
జాగ్రత్తలు పాటించాలి
రోడ్డు ప్రమాదాల నివారణ కు పోలీస్‌శాఖ తరఫున అ న్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. డ్రంకన్ డ్రైవ్‌తో కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నాం. ట్రాఫిక్ రూ ల్స్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు ట్రా ఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలి. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి
కొంప ముంచుతున్న డ్రంకన్ డ్రైవ్..
మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం అనీ, చట్టరిత్యా నేరమనీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రామలు చేపడుతుంది. అన్ని ఠాణాల పరిదిలో నిత్యం డ్రంకన్ డ్రైవ్ పరీఓలు చేస్తున్నారు. పట్టుబడిన వారికి జరిమానాలతో పాటు ఒకటి నుంచి రెండు రోజుల జైలు శిఓలు కూడా పడుతున్నాయి. అయినా డ్రంకన్ డ్రైవ్ విషయంలో వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఇటీవలి కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల ఘటనలు చూస్తే మద్యం సేవించి వాహనాలు నడిపిన ఘటనలే ఎక్కువ. ముఖ్యంగా యువత చెడు వ్యసనాల బారిన పడుతున్నట్లు తెలుస్తుంది. కొందరు గంజాయి, మద్యం, కల్తీ కల్లు లాంటి మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి చెడు వ్యసనాల కారణంగా మత్తులో ఉన్ననప్పుడు వాహనాలు నడిపిస్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు సైతం అనేకం. అందుకే ఇటీవల జిల్లా పోలీసులు పాఠశాల కళాశాల స్ధాయి నుంచే రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్ధులకు అవగాహణ కార్యక్రమాలు చేపడుతున్నారు. వాహనదారులు, ముఖ్యంగా యువత వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment