వరికి బోనస్ ఘనత కాంగ్రెస్‌దే
బాన్సువాడ : వరి పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ అందించిన ఘనత కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో 67,901 మంది రైతులనుంచి 4,98,226 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, కామారెడ్డి జిల్లాలో 30,640 మంది రైతుల వద్దనుంచి 2,10,724 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే గతేడాది కన్నా ఎక్కువ ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయన్నారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రెండుమూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి అవుతాయని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లకు..
బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి మొదటి విడతలో రూ.8 కోట్లు పంపిణీ చేశామని పోచారం తెలిపారు. మిగతా వారికి త్వరలో బిల్లులు వస్తాయన్నారు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తామని, నియోజకవర్గంలో మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. నారుమడులు వేయడానికి నిజాంసాగర్‌నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నందున ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందేలా చూస్తామన్నారు. అనంతరం పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, నాగులగామ వెంకన్న, ఎజాస్, నర్సింలు, సందీప్, నర్సన్న, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
నారుమళ్ల కోసం నిజాంసాగర్
నీటిని విడుదల చేశాం
వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment