నాలుగు బృందాలతో గాలిస్తున్నాం
● ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి
ఖలీల్‌వాడి : మేయర్ భర్త దండు శేఖర్‌పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి నాలుగు బృందా లు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన మాట్లాడా రు. భూ వివాదం నేపథ్యంలో రసూల్ దాడి చే శాడని చెప్పారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. దాడి వెనుక ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తను, సహకరించాలని వీడియో రిలీజ్ చేయడంపై విలేకరులు అడగ్గా అలాంటి ది ఏమి లేదని ఏసీపీ చెప్పారు. నిందితుడు ఆ టో డ్రైవర్‌గా, బౌన్సర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. శేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment