నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి
ఖలీల్‌వాడి : నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ దండు చంద్రశేఖర్ అలియాస్ శేఖర్‌పై దాడి జరిగింది. సోమవారం సాయంత్రం పదో డివిజన్‌లోని ఓ వాటర్ ప్లాంట్ వద్ద 80 క్వార్టర్స్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ రసూల్ అలియాస్ శుక్రు దాడి చేశాడు. ఆయన దగ్గరకు నడుచుకుంటూ వచ్చిన రసూల్ రాగానే దాడి చేశాడు. దీంతో శేఖర్ కింద పడిపోయాడు. పక్కనే ఉన్న వారు అడ్డుకోడానికి య త్నించగా రసూల్ వారిని బెదిరించాడు. అనంతరం ఆటోలో నుంచి సుత్తి తీసుకొని వచ్చి దానితో దండు శేఖర్‌ను కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
దాడి వీడియో వైరల్
దాడి చేయడానికి రసూల్ ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. దాడి చేయడానికి వెళ్లే సమయంలో వీడియో తీసేందుకు వ్యక్తిని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. దండు శేఖర్ అనుచరులు భూ వివాదంలో ఇబ్బందులకు గురి చేయడంతో దాడికి పాల్పడ్డారనే అభిప్రాయాలు ఉన్నా యి. మేయర్ భర్త శేఖర్‌పై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికంగా వంద గజాల ప్లాట్ వివాదంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది.
డబ్బులు డిమాండ్ చేయడంతో..
దాడి అనంతరం నిందితుడు రసూల్ వీడియో విడుదల చేశాడు. దండు శేఖర్ అనుచరులు గోపాల్ తోపాటు మరి కొంత మంది తన భూమి కబ్జా చేశారని పేర్కొన్నాడు. మూడేళ్ల నుంచి వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రూ.రెండు లక్షల డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించాడు. ఎన్నో సార్లు శేఖర్‌ను కలిసి తన భూమి అప్పగించాలని అ డిగినా ఆయన ఒప్పుకోకపోవడంతో దాడి చేశానని చెప్పారు. గత 15 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీ కో సం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయ కులు సాయం చేయాలని కోరాడు.
తీవ్రంగా గాయపడ్డ దండు చంద్రశేఖర్
ఆస్పత్రికి తరలించిన స్థానికులు
తన భూమి కబ్జా చేయడంతోనే
దాడి చేశానన్న నిందితుడు
వీడియో విడుదల
Comments
Please login to add a commentAdd a comment