హాస్టళ్లపై ఫోకస్‌! | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లపై ఫోకస్‌!

Published Mon, Nov 25 2024 7:46 AM | Last Updated on Mon, Nov 25 2024 7:46 AM

హాస్ట

హాస్టళ్లపై ఫోకస్‌!

సోమవారం శ్రీ 25 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

– 9లో u

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకులాల్లో మెనూ అమలుతీరు, సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ జిల్లా, మండల స్థాయిలో మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీ ఆయా మండలాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ హాస్టళ్ల నిర్వహణ మెరుగయ్యేలా చూడాల్సి ఉంటుంది. అలాగే ఒక్కో హాస్టల్‌కు జిల్లా/మండల స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారు. మండల స్థాయిలో పనిచేసే అధికారులు బృందంగా ఆయా హాస్టళ్లను సందర్శించి ఆయా హాస్టళ్ల పరిస్థితులపై మంగళవారం సాయంత్రం 4 గంటలలోగా రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందో లేదో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులు వారానికోసారి కచ్చితంగా తమకు కేటాయించిన హాస్టళ్లను సందర్శించాల్సి ఉంటుంది.

జిల్లాలో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలన్నీ కలిపి 129 ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో అధికారిని ఇన్‌చార్జీగా నియమించారు. ఇన్‌చార్జీలు తమకు కేటాయించిన హాస్టల్‌/గురుకులం/కేజీబీవీని వారానికోసారి సందర్శించాల్సి ఉంటుంది. భోజనంలో నాణ్యత లేకుంటే కలెక్టర్‌కు నివేదించాలి. అలాగే మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు, హాస్టళ్లలో వంట మనుషులతో కూడా మండల కమిటీలు సమావేశమై వారికి భోజనంలో నాణ్యతపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కూరగాయలు మురిగిపోకుండా చూడడం, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవడం, ఆవరణలో మురికి పేరుకుపోకుండా చర్యలు తీసుకోవడం, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా మండల, జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షించాలి. అక్కడ వసతులు, భోజనం నాణ్యత మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేకాధికారిదే. మండల, జిల్లా స్థాయి అధికారుల కమిటీలు ఆయా హాస్టళ్లను సందర్శించి పర్యవేక్షిస్తాయి. తద్వారా నాణ్యమైన భోజనం అందడంతో పాటు సౌకర్యాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

నాణ్యత మెరుగుపరిచేందుకు..

న్యూస్‌రీల్‌

అదనపు కలెక్టర్‌ చైర్మన్‌గా...

జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌(రెవె న్యూ) చైర్మన్‌గా, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) కోచైర్మన్‌గా, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారి, జిల్లా విద్యాధికారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, బీసీ కార్పొరేషన్‌ అధికారి, గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌ఎస్‌లతో పాటు ఆయా గురుకులాల ఆర్‌సీవోలతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ప్రత్యేకాధికారి, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవోలతో కమిటీ ఏర్పాటయ్యింది. మండల స్థాయి అధికారుల కమిటీ మంగళవారం సా యంత్రం 4 గంటలలోగా తమ పరిధిలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలను సందర్శించి ఆయా సంస్థలలో విద్యార్థుల హాజ రు, వారికి అందిస్తున్న భోజనం, తాగునీటి నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, మూత్రశాల లు, మరుగుదొడ్లు ఏ స్థాయిలో ఉన్నాయి, ఆర్‌వో సిస్టంలు, సోలార్‌ వాటర్‌ హీటర్లు ఎలా పనిచేస్తున్నాయి అన్న వివరాలతో జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

మెనూ అమలు,

సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

జిల్లా, మండల స్థాయి

కమిటీల ఏర్పాటు

ఒక్కో హాస్టల్‌కు

ఒక్కో ఇన్‌చార్జీ అధికారి నియామకం

రేపే రిపోర్టు ఇవ్వాలని

సర్కారు ఆదేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
హాస్టళ్లపై ఫోకస్‌!1
1/2

హాస్టళ్లపై ఫోకస్‌!

హాస్టళ్లపై ఫోకస్‌!2
2/2

హాస్టళ్లపై ఫోకస్‌!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement