అతివలకు ‘ఉపాధి’ హామీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధి హామీ పథకంలో ‘మహిళా శక్తి భరోసా’ పేరుతో ఆరు రకాల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండలాల వారీగా ఆయా పనులకు సంబంధించిన టార్గెట్‌లను కూడా నిర్దేశించింది. జిల్లాలోని అన్ని మండలాల్లో పనులు చేపట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు (వచ్చే ఏడాది మార్చి 31) నాటికి లక్ష్యాలను సాఽధించేలా కసరత్తు చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల్లో మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి మరింత భరోసా కల్పించినట్టవుతుందని ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆరు రకాల పనులివే..
● మహిళా శక్తి –ఉపాధి భరోసా పేరుతో ఇప్పటికే పశువులను కొనుగోలు చేసిన మహిళా రైతులు పశువుల కొట్టాలు నిర్మించుకునేందుకు అవకా శం కల్పించారు. ఒక్కో మండలానికి పది యూనిట్లు మంజూరు చేయనున్నారు. నాచు పెంచడానికి అవసరమైన తొట్లను నిర్మించడా నికి మండలానికి 20 యూనిట్లు కేటాయించా రు. వర్మి కంపోస్టు పిట్లను నిర్మించడానికి పది యూనిట్లు, పౌల్ట్రీ షెడ్‌లు ఒక్కో మండలానికి ఒక యూనిట్, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన రైతుల భూముల అభివృద్ధికి సంబంధించి మండలానికి 15 యూనిట్లు కేటాయించారు.
● పొలం బాటలు నిర్మిస్తారు. వ్యవసాయ పొలా ల వద్దకు వెళ్లడానికి అవసరమైన రోడ్లను చదు ను చేయడం, మొరం చల్లడానికిగాను మండలానికి మూడు యూనిట్లు మంజూరు చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ఇంటికి చేర్చడానికి అనుకూలంగా రోడ్లు వేయనున్నారు.
● హార్టికల్చర్ ద్వారా ఫల వనాలకు సంబంధించి గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈత, తాటి వనాలు కూడా ఉంటాయి. హార్టికల్చర్ ప్లాంటేషన్ కోసం మండలానికి ఐదు యూనిట్లు ఇస్తారు.
● జలనిధి కార్యక్రమంలో భాగంగా నీటి ప్రవాహాలకు అడ్డుకట్టలు నిర్మించి నీటిని భూమిలోకి ఇంకేలా చేయడానికి మండలానికి రెండు యూనిట్లు, అలాగే మండలానికి ఒక చెక్‌డ్యాం, ఐదు ఇంకుడు గుంతలు, ఐదు ఊట చెరువులు, ఇంటి పైకప్పు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడానికి చేపట్టాల్సిన పనులు ఐదు, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లకు రెండు, సాగునీటి బావుల తవ్వకానికి ఒకటి కేటాయించారు.
● వ్యక్తిగత సోక్‌పిట్ల తవ్వకానికి పది యూనిట్లు కేటాయించారు.
● స్కూల్ టాయ్‌లెట్లు, సీసీ రోడ్స్, జీపీ బిల్డింగ్, అంగన్‌వాడీ కేంద్రాలు ఒక్కొక్కటి నిర్మించాల్సి ఉంటుంది.
మహిళా శక్తి భరోసా కింద
ఆరు రకాల పనులు
లక్ష్యాలను సాధించేందుకు కసరత్తు
Comments
Please login to add a commentAdd a comment