జిల్లాలో మొరం అక్రమ తరలింపును అదుపు చేయడంలో భూగర్భ గనులశాఖది కీలకపాత్ర. కానీ వారు సిబ్బంది కొరత పేరుతో పూర్తిగా తనిఖీలను మర్చిపోయారు. 16 మంది టీఏలు, ఆర్‌ఐలకుగాను కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. తనిఖీల విషయంలో మైనింగ్ శాఖ పూర్తిగా చేతులెత్తేసింది. వారికి లీజులు, టీపీల యజమానులు, అక్రమంగా తరలించే వారి నుంచి ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. లీజు, టీపీల నుంచి మొరం వ్యాపారులు ఒక పర్మిట్ తీసుకుని, రోజంతా టిప్పర్లలో మొరం తరలిస్తారనేది బహిరంగ రహస్యం. లీజుల్లో నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్ల మొరం తరలుతుందో మైనింగ్‌శాఖ వద్ద వివరాలు లేకపోవడం విడ్డూరం.
Comments
Please login to add a commentAdd a comment