ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎల్లారెడ్డిరూరల్: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారు గురువారం ఎంఈవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కామారెడ్డి రూరల్: తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి సమగ్ర శిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే పేస్కేలు అమలు చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని అడిగారు. హామీలు నెరవేర్చకపోతే డిసెంబర్ మొదటి వారంలో సమ్మెకు వెళ్తామన్నారు. ఉద్యోగులు చిరంజీవి, మాధవి, శైలజ, భక్తమాల సారిక, రాములు, సాయిరెడ్డి రమేష్, శంకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment