జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ పోటీలు
కామారెడ్డి టౌన్/కామారెడ్డిరూరల్‌భిక్కనూరు/లింగంపేట: జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం జిల్లా స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో జిల్లాలోని 47 పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు డీఈవో ఎస్.రాజు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్దిరామిరెడ్డి, జన విజ్ఞాన వేదిన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రతినిధులు యాదగౌడ్, ప్రవీణ్ కుమార్, శ్రీశైలం, రాజ్‌కుమార్, కృష్ణాకర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆయా పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలకు నిరంజన్
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి గిరిజన బాలుర పాఠశాల విద్యార్థి నిరంజన్ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా అండర్–14 బాలుర పోటీలకు ఎంపికై నట్లు కోచ్ నరేష్ తెలిపారు. గాంధారి మండలం పోతంగల్ కలాన్‌లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సెపక్ తక్రా ఎంపికల్లో నిరంజన్ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు కోచ్ నరేష్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలకు..
దోమకొండ: అర్చరీ పోటీలు గురువారం దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో నిర్వహించారు. పోటీల్లో 21 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు జిల్లా అర్చరీ అధ్యక్షుడు తీగల తిర్మల్ గౌడ్, అర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్‌లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అర్చరీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ రెడ్డి, దోమకొండ గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నాయకులు పున్న లక్ష్మణ్, బుర్రి రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment