గుట్టుగా గుట్టలు స్వాహా..
సుభాష్‌నగర్: జిల్లాలో మైనింగ్ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం లీజులకు అనుమతులు ఇవ్వకపోవడం అటు మాఫియాకు.. ఇటు అధికారులకు వరంగా మారుతోంది. మొరం తరలింపునకు దరఖాస్తులు పెట్టుకున్నా.. నెలల తరబడి వాటికి మోక్షం లభించక పోవడంతో నిబంధనల సాకు చూపుతూ వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో గనుల శాఖ, మండలాల్లో రెవెన్యూ, పోలీసులను మచ్చిక చేసుకుని అక్రమ దందా నడిపిస్తున్నారు. మండలాల్లో మొరం దందా అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వీటన్నింటిని లెక్కలేసుకుంటున్న మాఫియా వ్యాపారులు టిప్పర్ ధర రూ.4వేలకు అమాంతంగా పెంచేశారు.
జిల్లాలో ఏడు ప్రాంతాల్లో మొరం తరలింపునకు లీజులు (ఐదేళ్లు) మాత్రమే ఉన్నాయి. లీజుల్లో వివిధ కారణాలతో కేవలం మూడు మాత్రమే కొనసాగుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ అవసరాలు, పనుల నిమిత్తం ఆర్మూర్, రెంజల్, డిచ్‌పల్లి మండలంలో టీపీలు (టెంపరరీ పర్మిట్) ఉన్నాయి. ప్రయివేటు కాంట్రాక్టర్లు, మొరం వ్యాపారులు టీపీల కోసం సుమారు 35 వరకు దరఖాస్తులు పెట్టుకున్నట్లు సమాచారం.
అడ్డుకట్ట వేసేదెవరు..?
జిల్లావ్యాప్తంగా మొరం అక్రమ దందాకు అడ్డుకట్ట వేయకపోగా,కాసుల కక్కుర్తికి మరిగిన రెవెన్యూ అ ధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు నెలకు ఫలానా మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మొరం దందా కొనసాగించాలంటే ముందుగానే అధికారులకు ముడుపులు ముట్టజెప్పా ల్సిందే. లేకుంటే తెలిసిన వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ముడుపులు అందితే అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ధర పెంచిన వ్యాపారులు
మొరం దందా మూడు పుప్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఒ క్కో టిప్పర్ మొరం ధర కనీసం రూ.4000 నుంచి రూ.4500లకు (దూరం, డిమాండ్‌ను బట్టి) పెంచేశారు. ఏడాది క్రితం రూ.3వేల లోపే ఉన్న ధర ఎందుకు పెంచారని ప్రజలు అడిగితే అధికారులకు మామూళ్లు ఇవ్వాలని బహిరంగంగా చెప్పడం గమనార్హం.
టెండర్లు నిర్వహించాలి
మొరం లీజులు, టీపీలకు అనుమతులు ఇవ్వకపోవ డంతో మాఫియా ఇష్టారీతిన గుట్టలను స్వాహా చే స్తోంది. మొరానికి జిల్లా వ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. అక్రమంగా తరలించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లల్లో గండి పడుతోంది. మొ రం అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడాలంటే ప్రభుత్వమే మండలానికి రెండు చోట్ల టెండర్లు నిర్వహించాలి. లేకుంటే లీజులు, టీపీల కోసం పెట్టుకున్న దరఖాస్తులకు మోక్షం లభించాలి. ప్రభు త్వం ఈ దిశగా చర్యలు చేపడితే మొరం అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
జిల్లావ్యాప్తంగా మొరం అక్రమ తరలింపు
మైనింగ్, రెవెన్యూ, పోలీస్‌శాఖకు కాసులు కురిపిస్తున్న మొరం దందా
సిబ్బంది కొరత సాకుతో తనిఖీలను మరిచిన గనులశాఖ
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
Comments
Please login to add a commentAdd a comment