ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం
నిజాంసాగర్(జుక్కల్): ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యువతను సిద్ధం చేస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన టీపీపీసీ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రాడ్యుయేట్‌ల ఓటును చేర్పిస్తున్నామన్నారు.
జేసీబీ పట్టివేత
నస్రుల్లాబాద్: మండలంలోని బొప్పాస్‌పల్లి పరిధిలో ఉన్న అటవీ భూముల్లో మొరం తవ్వకాలు చేపడుతున్న జేసీబీని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ నరేశ్, బీట్ ఆఫీసర్ రమాకాంత్ అడ్డుకున్నారు. దీంతో జేసీబీని బాన్సువాడ ఫారెస్టు ఆఫీసుకు తీసుకెళ్లకుండా మండల కేంద్రంలోని చెక్ పోస్టు వద్ద జేసీబీ సంబందీకులు, బొప్పాస్‌పల్లి గ్రామస్తులు కొంత మంది అడ్డుకున్నారు. ప్రభుత్వ పనులకు అధికారులు మొరం అవసరం అనడంతోనే తమ స్వంత భూమిలో జేసీబీ నడుపుతున్నామని అటవీ శాఖ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు, ఎంపీడీవో అనుమతులతో మొరం తవ్వకాలు చేపట్టామన్నారు. జేసీబీని తీసుకెళ్లడానికి వీలు లేదంటూ వాదించారు. దీంతో అటవీ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో రెండు గంటల పాటు పోలీసులు సముదాయించారు. పోలీసులు జేసీబీని అదుపులోకి తీసుకుని సంబంధిత అధికారులతో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలుపడంతో గొడవ సద్దుమణిగింది.
పాఠశాల తనిఖీ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఆర్‌కే పబ్లిక్ పాఠశాలను గురువారం మండల విద్యాధికారి శౌకత్‌అలీ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాల తరగతి గదులు, టాయి లెట్స్, రికార్డులు పరిశీలించారు. పాఠశాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. యుడైస్ ప్రకారం పిల్లల సంఖ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉంచాలన్నారు. సీఆర్పీ గంగాధర్, పాఠశాల ఉపాధ్యాయులు మమత తదితరులున్నారు.
నిరసన దీక్షలను
విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్: సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 29, 30వ తేదిలలో చేపట్టే నిరసన దీక్షలను విజయవంతం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రెండు రోజుల పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో విద్యావనరుల కేంద్రం వద్ద నిరసన దీక్షలను చేపట్టాలని, ప్రతీ ఉద్యోగి పాల్గొనాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసి, విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment