మాస్టర్ ప్లాన్ రద్దయింది.. ఆందోళన చెందొద్దు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్‌లో 2023 ప్రవేశ పెట్టిన ముసాయిదా మాస్టర్ ప్లాన్ రద్దయిందని, రైతులు ఆందోళన చెందవద్దని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం మాస్టర్ ప్లాన్ బాధిత జేఏసీ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. మున్సిపల్ కౌన్సిల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేసినా ఇంకా అధికారికంగా ప్రభుత్వం నుంచి జీవో రాలేదని ఇంకా ఆందోళనగా ఉందని తమకు న్యాయం చేయాలని రైతులు ఎమ్మెల్యేకు కోరారు. అవసరానికి, ఆపధలో భూములు అమ్ముకుందామంటే కొనే వారు ముందుకు రావడం లేరని ప్రభుత్వం నుంచి రద్దు జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ రద్దయిందని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రద్దయిన మాస్టర్‌ప్లాన్ ఎక్కడా అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మళ్లీ నూతన మాస్టర్‌ప్లాన్ కోసం సర్వే చేసి ముసాయిదాను సిద్ధం చేసిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, మళ్లీ కౌన్సిల్ తీర్మానం చేశాకే నూతన మాస్టర్‌ప్లాన్ అమలవుతుందని వివరించారు. అప్పటి దాక పాత మాస్టర్‌ప్లాన్ అమలులో ఉంటుందన్నారు. 8 గ్రామాల బాధిత రైతుల భూముల విషయంలో ఇండస్ట్రీయల్, గ్రీన్‌జోన్‌ల సమస్య ఏర్పడితే అండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రజల మెప్పుతోనే నూతన మాస్టర్‌ప్లాన్ అమలు చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, 8 గ్రామాల బాధిత రైతులు పాల్గొన్నారు.
పుర ప్రజల మెప్పుతో
నూతన మాస్టర్‌ప్లాన్ అమలు చేద్దాం
బాధిత రైతులతో
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment