ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
● మాస్టర్‌ప్లాన్ బాధిత రైతులతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ బాధిత రైతుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ అన్నారు. మాస్టర్‌ప్లాన్ బాధితుల జేఏసి ఆధ్వర్యంలో రైతులు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆమెను కలిసి, సమస్యను వివరించారు. మాస్టర్‌ప్లాన్ రద్దు జీవో కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, రైతులు పాల్గొన్నారు.
గురుకుల కాలేజీలో
ఆర్థిక శాఖ కార్యదర్శి బస
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థినులు బాగా చదివి మంచి మార్కులను సాధించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరిత అన్నారు. బుధవారం రాత్రి ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి పాఠశాలలోనే బస చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై
అవగాహన అవసరం
కామారెడ్డి క్రైం: రోడ్డు భద్రత నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీటీవో శ్రీనివాస రెడ్డి సూచించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఆయా పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారికి అవగాహన కల్పించారు. డీటీవో మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు పాల్గొన్నారు.
అర్హులందరికీ
సంక్షేమ పథకాలు
గాంధారి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని డీఆర్‌డీవో సురేందర్ సూచించారు. మండలంలోని జువ్వాడి గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామసభల్లో చదివి వినిపించే జాబితాలు దరఖాస్తులు చేసుకున్న వారివన్నారు. ఈ జాబితాల్లో ఉన్నవారందరూ లబ్ధిదారులు కాదని తెలిపారు. జాబితాలో పేర్లు లేనివారు అర్హులైతే దరఖాస్తులు తీసుకుని వారిని ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. గ్రామసభల్లో చదివిన జాబితాల్లో అనర్హులుంటే తొలగిస్తామన్నారు. మండల ప్రత్యేకాధికారి లక్ష్మీప్రసన్న, ఎంపీడీవో రాజేశ్వర్ ఉన్నారు.
పరిశోధనల్లో
వెనుకబడి ఉన్నాం
కామారెడ్డి అర్బన్: పరిశోధన, మేధాసంపత్తి హక్కులు పొందడంలో యూరప్ దేశాల కన్న మనం ఎంతో వెనుకబడి ఉన్నామని వివిధ కళాశాల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. బుధవారం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వృక్షశాస్త్ర విభాగం, కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘మేధో సంపత్తి హక్కులు– ఉన్నత విద్యలో పరిశోధన’ అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. మేధో సంపత్తి, పరిశోధనల్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ది చెందాలని, అధ్యాపకులు, విద్యార్థుల నిరంతర కృషి అవసరమన్నారు. వెబినార్‌లో కామారెడ్డి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, కరీంనగర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ప్యాట్రన్లుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment