పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
● అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి రూరల్: అర్హత ఉండి గ్రామ సభల్లో చదివిన జాబితాలో పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అదనపు కలెక్టర్(రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం కామారెడ్డి మండలం శాబ్దిపూర్, గూడెం, తిమ్మక్‌పల్లి, ఉగ్రవాయి గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి. శాబ్దిపూర్ గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేవిధంగా చూస్తామన్నారు. కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీవో నాగవర్ధన్, మాజీ జెడ్పీటీసీ నిమ్మ మోహన్‌రెడ్డి, నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment