రాష్ట్రంలో చాలా కాలంగా నూతన రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతో మంది ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. తీరా ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు రాకపోవడంతో అధికారులతో గొడవకు దిగుతున్నారు. ప్రతీ గ్రామంలో ఇదే సమస్య ఎదురవుతోంది. తమకు కార్డులు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలకు దిగుతున్నారు. వారిని సముదాయించడానికి అధికారులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే భూమిలేని రైతు కూలీల కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా చాలా మంది అర్హులకు రాలేదు. ఇదే సమయంలో అనర్హుల పేర్లు వచ్చాయంటూ చాలా గ్రామాల్లో నిరసనలకు దిగుతున్నారు. లీడర్లు చెప్పినవారి పేర్లే రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలపైనా అవే నిరసనలు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment