మహిళల నైపుణ్యాలు, మార్కెట్‌లో డిమాండ్ తదితర పరిస్థితులు పట్టించుకోకుండా అధికారులు పలు పథకాలు అమలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడో ఒక చోట సక్సెస్ అయ్యాయని వారికి అంతగా అవగాహన లేని పథకాలను తమ టార్గెట్ల కోసం అధికారులు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తుండటంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన కింద సోలార్ యూనిట్లు, డ్రోన్ దీదీ పథకం, సిమెంట్ ఇటుకల తయారీ, మహిళా శక్తి క్యాంటీన్లు, దేశీ కోళ్ల పెంపకం లాంటి పథకాలను ఏర్పాటు చేయించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో పలు యూనిట్లు కొందరు మహిళలు ఏర్పాటు చేసుకున్నారు. పీఎం కుసుమ్ యోజన పథకం కింద నాలుగైదు ఎకరాల ప్రభుత్వ భూముల్లో దాదాపు రూ.3కోట్లకు వ్యయంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఇందులో కొంత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అయినా ఇంత భారీ యూనిట్ ఏర్పాటు చేశాక ఏమైనా సమస్య వస్తే ఎలా అని పలువురు అంటున్నారు. ఆయా యూనిట్లతో కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం కష్టమేనని, పైగా అప్పులు మిగులుతాయని పలువురు మహిళలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment