అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
తాడ్వాయి: ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెడుతున్న పథకాల జాబితాలో పేరు రాని అర్హులు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఎంపీడీవో కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామసభలలో ఏమైన అభ్యంతరాలు, ఆక్షేపణలు, చేర్పులు ఉంటే తెలువచ్చన్నారు. దరఖాస్తులను పరిశీలించిన తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజారాం, ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ, ఏవో నర్సింలు, ఏపీఎం మనోహర్, ఏపీవో కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment