యుద్ధప్రాతిపదికన సబ్‌స్టేషన్ మరమ్మతులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తామని ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (హెచ్‌ఆర్‌డీ అండ్ ఐర్) బి అశోక్ కుమార్ తెలిపారు. సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో బుధవారం ఆయన పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిందని ఎవరి నిర్లక్ష్యం లేదన్నారు. ప్రమాదం జరిగిన గంటలోపే సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టిన అధికారులను అభినందించారు. ప్రమాదంతో రూ.1.50 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎన్ శ్రావణ్, డీఈఈలు కళ్యాణ్ చక్రవర్తి, ప్రభాకర్, నాగరాజు. ఈఈ స్వామి, ఏడీఈలు కిరణ్ చైతన్య, సతీష్, జైరాజ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment