విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
పిట్లం(జుక్కల్): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పిట్లంలోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని స్టోర్ రూం, వంట గది, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
అర్హులకు పథకాలు అందేలా చూడాలి
మార్దండ గ్రామంలో బుధవారం జరిగిన ప్రజాపాలన గ్రామసభలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవో కమలాకర్, తహసీల్దార్ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment