దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ఖలీల్‌వాడి: జువెల్లర్ దుకాణాల్లో సీసీ కెమెరాలు, హైసెక్యూరిటీ లాక్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఏ సీపీ రాజావెంకట్ రెడ్డి షాప్ యజమానులకు సూ చించారు. నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డ్ షాప్స్ యజమానులతో బుధవా రం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగతనాలు, సైబర్ నేరాలపై వారికి అవగాహన కల్పించారు. ఏసీపీ మాట్లాడుతూ.. దుకాణాల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని తెలిపారు. వ్యాపారం ముగిసిన తరువాత గోల్డ్, క్యాష్ సేఫర్‌లో భద్రపర్చాలని, సేఫర్లు ఎవరికీ కనిపించని ప్లేస్‌లో పెట్టాలన్నారు. డిజిటల్ ట్రాన్సక్షన్స్ మాత్రమే చేయాలని తెలిపారు. సీసీటీ వీ కెమెరాలు బిగించి, క్లౌడ్ స్టోరేజ్‌కి అనుసంధానం చేయాలన్నారు. షాప్‌లల్లో అలారం సిస్టంను బిగించుకొని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేయాలన్నారు. క్యాష్, గోల్డ్ తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment