పక్కాగా ఈవీఎంల కమిషనింగ్‌ | Sakshi
Sakshi News home page

పక్కాగా ఈవీఎంల కమిషనింగ్‌

Published Tue, May 7 2024 4:55 AM

పక్కాగా ఈవీఎంల కమిషనింగ్‌

● ఎలాంటి పొరపాట్లు జరగొద్దు ● పకడ్బందీగా మాక్‌ పోలింగ్‌ ● కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ అర్బన్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్‌ను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి, పాలిటెక్నిక్‌ కళాశాలలో మానకొండూర్‌ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంల కమిషనింగ్‌ను అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌ దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌తో కలిసి పరిశీ లించారు. కమిషనింగ్‌, బ్యాలెట్‌ పత్రాల ఏర్పాటు, వీవీప్యాట్స్‌లో సింబల్‌ లోడింగ్‌పై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వీవీ ప్యాట్స్‌ల్లో జాగ్రత్తగా సింబల్‌ లోడింగ్‌ చేయాలని సూచించారు. ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలని, ఎలాంటి తప్పిదా లు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో 395 పోలింగ్‌ స్టేషన్లకు బ్యాలెట్‌ యూనిట్స్‌ 990, కంట్రోల్‌ యూనిట్స్‌ 493, వీవీ ప్యాట్స్‌ 553 రిజర్వ్‌తో కలు పుకుని కేటాయించామని వివరించారు. చొప్పదండి నియోజకవర్గంలో 327పోలింగ్‌ స్టేషన్లకు 820 బ్యాలెట్‌ యూనిట్స్‌, 408 కంట్రోల్‌ యూనిట్స్‌, 457 వీవీ ప్యాట్స్‌, మానకొండూర్‌ నియోజకవర్గంలో 316 పోలింగ్‌ స్టేషన్లకు బ్యాలెట్‌ యూనిట్లు 794, కంట్రోల్‌ యూనిట్లు 395, వీవీ ప్యాట్స్‌ 442 కేటాయించామని వెల్లడించారు. కమిషనర్‌ పూర్తయిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరుస్తారని తెలిపారు. పోలింగ్‌ ఒక రోజు ముందు వీటన్నింటినీ పోలింగ్‌ కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్‌ చేస్తామన్నారు. ట్రైనీ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్దార్లు కనకయ్య, రమేశ్‌, రాజేశ్‌, నరేందర్‌, రాజకుమార్‌ పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement