లారీ ట్యాంకర్‌లో గంజాయి రవాణా
● రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు.. ● కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టుకున్న పోలీసులు
వాంకిడి(ఆసిఫాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు భా రీగా గంజాయిని పట్టుకున్నారు. పుష్ప సినిమా స్టైల్‌లో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ లారీ ట్యాంకర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు 290 కిలోల గంజాయిని తరలిస్తుండగా తనిఖీలో రవాణా గుట్టు బయటపడింది. వాంకిడి మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌లో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర అ సెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అంతర్రాష్ట్ర సరిహద్దు వాంకిడి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఆసిఫాబాద్ వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ ట్యాంకర్(ఎంపీ 06 హెచ్‌సీ 1339) డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. ట్యాంకర్‌ను తనిఖీ చేయగా భారీ మొత్తంలో గంజాయి లభ్యమైందని ఎస్పీ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన అరబింద గంజాయి సరాఫరా కోసం బల్వీర్‌సింగ్‌ను రాజమండ్రికి పంపినట్లు విచారణలో తేలిందన్నారు. రాజమండ్రిలో గంజాయిని లోడ్ చేసుకుని తిరిగి మహారాష్ట్రకు వస్తుండగా వాంకిడి వద్ద పట్టుకున్నామని వివరించారు. రెండు కిలోల చొప్పున 145 ప్యాకెట్లు లభ్యంకాగా.. వాటి విలువ రూ.72.50లక్షలు ఉంటుందన్నారు. గంజాయితోపాటు లారీ ట్యాంకర్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందుతుడు అరబింద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్‌కు పంపించామన్నారు. సమావేశంలో ఆసిఫాబాద్ డీఎస్పీ కరుణాకర్, వాంకిడి సీఐ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణా ప్రతాప్, ఆసిఫాబాద్ సీఐ రవీందర్, వాంకిడి ఎస్సై ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment