సెటిల్‌మెంట్ అని పిలిపించి..
మాజీ కానిస్టేబుల్ ఈశ్వర్‌పై హత్యాయత్నం
‘దొంగలతో దోస్తీ’ ఆరోపణలపై పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయిన మేకల ఈశ్వర్‌పై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది. వ్యవస్థీకృతంగా జేబు దొంగల ముఠాలు నడిపే ఈశ్వర్‌కు, ఆ ముఠాలకు చెందిన మరికొందరు నాయకుల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటూ తెలంగాణ వ్యాప్తంగా సెల్‌ఫోన్ జేబు దొంగల ముఠాలు నిర్వహిస్తున్న ఇతడిని సెటిల్‌మెంట్ కోసమని పిలిచిన నలుగురు కీలక నిందితులు కారుతో ఢీ కొట్టారు. అతడి పైనుంచి రెండుసార్లు వాహనాన్ని నడపటంతో ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన జరగ్గా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలిసింది. – సాక్షి, హైదరాబాద్
ఏళ్లుగా జేబుదొంగల గ్యాంగ్‌లు నిర్వహిస్తున్న ఈశ్వర్.. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల చోరీలు
ఈ వ్యవస్థీకృత దందాలో ఇతడిదే పూర్తి ఆధిపత్యం.. దీంతో ముఠా నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు
Comments
Please login to add a commentAdd a comment