ఎరుకల కులస్తుల సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్: ఎరుకల కులస్తుల సమస్యలు పరిష్కరించాలని, పందుల పెంపకం కోసం ప్రతీ ఎరుకల కుటుంబానికి ఐదు గుంటల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ పందుల యజమానులకు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. శాసీ్త్రయ పద్ధతిలో పందుల పెంపకం కోసం ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇప్పించి వందశాతం సబ్సిడీతో పందుల ఫామ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల ప్రజా సమితి నాయకులు ఉపేందర్, కుమారస్వామి, వెంకటేశ్, సాగర్, సమ్ములు, సమ్మయ్య, పోచయ్య, ఎల్లయ్య, తిరుపతి, సంపత్, రాజు, బిజిలి కనుకయ్య, తిరుపతి, శ్రీను, తిరుపతి, కిష్టయ్య, చంద్రశేఖర్, వెంకటేశ్, రమేశ్, రాజు, మల్లేశ్, శ్రీకాంత్, స్వామి, రాజు, కుమార్, సంపత్,సతీష్, భాగ్య, విజయ, లక్ష్మి, జ్యోతి, తిరుపతమ్మ, తిరుమల, లక్ష్మి, రాజేశ్వరి, సారవ్వ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment