ఉపాధ్యాయ సమస్యలను ప్రశ్నించే గొంతుకనవుతా | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలను ప్రశ్నించే గొంతుకనవుతా

Published Wed, Nov 13 2024 1:12 AM | Last Updated on Wed, Nov 13 2024 1:12 AM

ఉపాధ్యాయ సమస్యలను ప్రశ్నించే గొంతుకనవుతా

ఉపాధ్యాయ సమస్యలను ప్రశ్నించే గొంతుకనవుతా

విద్యానగర్‌(కరీంనగర్‌): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలను ప్రశ్నించే గొంతుకనవుతానని వంగ మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పీఆర్‌టీయూ నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. 25 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశానని అన్నారు. వీఎంఆర్‌ ఫౌండేషన్‌ పేరున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తాను ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐలేని కరుణాకర్‌రెడ్డి, మర్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర బాధ్యులు జమీల్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement