విద్యార్థుల్లో ఆలోచన విధానాన్ని పెంచేందుకు కృషి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే సృజనాత్మకతతో పాటు ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘అల్ఫోర్స్ కిడోస్ న్యాక్’ ను ప్రారంభించారు. విద్యార్థులకు వార్షిక ప్రణాళికలో భాగంగా ఎన్నో విషయాలను నేర్పాల్సిన అవసరం ఉంటుందని, ఆ విషయాలను చాలా ఆలోచింపచేసే విధంగా బోధిస్తే వాటిని గుర్తుంచుకుంటారని అన్నారు. అదేవిధంగా పరీక్ష విధానంలో చాలా సులభంగా జవాబులు రాసేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment