రూ.2.71 లక్షల వంచన | Sakshi
Sakshi News home page

రూ.2.71 లక్షల వంచన

Published Tue, May 7 2024 3:55 AM

-

హుబ్లీ: టాస్క్‌ ఇవ్వడం ద్వారా అధిక డబ్బులు సంపదించవచ్చని ఓ మహిళ నుంచి రూ.2.71 లక్షలను కేటుగాళ్లు తమ ఖాతాలోకి బదలాయించుకొని వంచించిన ఘటన నగరంలో శనివారం వెలుగు చూసింది. గోకుల్‌ రోడ్డు నెరమెట్ల పాటిల్‌ జయంతి బాధితురాలు. ఫేస్‌బుక్‌లో వచ్చిన వర్క్‌ ఫ్రం హోం వాణిజ్య ప్రకటనలో ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయగా వాట్సాప్‌ చాట్‌ ఓపెన్‌ అయింది. అందులో కూర్చున్న చోటే టాస్క్‌లను పూర్తి చేసి డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి ఆ మేరకు టెలిగ్రామ్‌లో ఆమెను చేర్పించుకున్నారు. ఈ క్రమంలో ఆమె వివిధ బ్యాంక్‌ ఖాతాల నుంచి పైమేర నగదును బదలాయించుకున్నట్లుగా ఆమె నగర సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరో ఘటనలో రూ.47 వేలు..

రామేశ్వరంలో రూం బుక్‌ చేయడానికి గూగుల్‌లో వెతికి తీసిన ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసిన మహిళ నుంచి రూ.47 వేలను బదలాయించుకొని వంచించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. శీలవంతర వీధికి చెందిన పూర్ణిమ బాధితురాలు. గూగుల్‌లో వెతికిన నెంబర్‌కు ఫోన్‌ చేయగా రూం బుక్‌ చేసే విషయంపై విచారించిన వేళ కనిపించిన లింక్‌ను క్లిక్‌ చేయడంతో కేటుగాళ్లు ఆమె బ్యాంక్‌ నుంచి నగదును బదలాయించుకున్నట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంటిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 
Advertisement
 
Advertisement