కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి | Sakshi
Sakshi News home page

కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి

Published Tue, May 7 2024 4:10 AM

కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి

కోలారు: కార్మికులకు ప్రభుత్వాలు మౌలిక సౌకర్యాలను కల్పించాలని రైతు సంఘం పదాధికారులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ప్రగతిశీల రైతు బంగవాది నాగరాజగౌడ వ్యవసాయ భూమిలో విశ్వ కార్మిక దినోత్సవంలో రైతు మహిళలకు మొక్కలు, రైతు ధ్వజాన్ని అందించి మాట్లాడారు. కార్మికులు ఫ్యాక్టరీలతో పాటు వివిధ క్షేత్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కార్మికులు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మికులకు ప్రభుత్వం తగిన మౌలిక సౌకర్యాలను కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్మికులు లేని దేశాన్ని ఊహించుకోవడం కష్టమన్నారు. తాలూకా అధ్యక్షుడు తేర్నహళ్లి అంజినప్ప మాట్లాడుతూ ప్రతినిత్యం దాదాపు 10 గంటలకు పైగా పని చేసే కార్మికులకు కార్మిక శాఖ నియాలు అనుసరించి కనీస వేతనాలు అందడం లేదన్నారు. ఆరోగ్యం తదితర విషయాల్లో కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయన్నారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్‌, తాలూకా అధ్యక్షుడు యలువళ్లి ప్రభాకర్‌, సుప్రీం చల, గిరీష్‌, రామసాగర వేణు తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement