డీకేశిని మంత్రివర్గం నుంచి తప్పించాలి | Sakshi
Sakshi News home page

డీకేశిని మంత్రివర్గం నుంచి తప్పించాలి

Published Wed, May 8 2024 1:15 AM

-

శివాజీనగర: ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో డీసీఎం డీ.కే.శివకుమార్‌ హస్తం ఉన్న ఆరోపణలు నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి డిమాండ్‌ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన డీ.కే.శివకుమార్‌ చరిత్ర అందరికి తెలుసు. రేవణ్ణను అరెస్ట్‌ చేయించిన సీఎం ముందుగా తన క్యాబినెట్‌ నుండి డీ.కే.శివకుమార్‌ను తొలగించాలని కుమారస్వామి ధ్వజమెత్తారు. కేసు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలంటే డీకేశిని పదవి నుంచి తప్పించాలని అన్నారు. తమ పేరును పదే పదే ఉపయోగించుకొంటున్న నేపథ్యంలో స్టే తీసుకొచ్చాం. తాను ఇక్కడ నేడు ప్రజా ప్రతినిధి ఆ బాధ్యతతో కూర్చొన్నాను. తన వ్యక్తిగతం కాదు ఇది. రాష్ట్రంలో పెనుమార్పుల నేపథ్యంలో ప్రజల ముందు తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానని తెలిపారు. ప్రజ్వల్‌ కేసులో 16 ఏళ్ల బాలిక కూడా బాధితురాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ బహిరంగంగా చెప్పారు. ఏ ఆధారంతో రాహుల్‌ ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బాధితులకు భద్రత కల్పించడం పట్టించుకోదు, ఈ ప్రభుత్వానికి కావాల్సింది కేవలం ప్రచారం మాత్రమేనని దుయ్యబట్టారు. కావాలనే వేలాది పెన్‌డ్రైవ్‌లను హాసన్‌లో వెదజల్లారని ఆరోపించారు.

జేడీఎస్‌ నేత హెచ్‌డీ

కుమారస్వామి డిమాండ్‌

 
Advertisement
 
Advertisement