Bengaluru Crime: లిఫ్ట్‌ అడిగిన విద్యార్థిని, కాటేసిన మృగాడు | - | Sakshi
Sakshi News home page

Bengaluru Crime: లిఫ్ట్‌ అడిగిన విద్యార్థిని, కాటేసిన మృగాడు

Published Mon, Aug 19 2024 12:40 AM | Last Updated on Mon, Aug 19 2024 8:33 AM

-

బొమ్మనహళ్లి: కోల్‌కతాలో వైద్య విద్యార్థినిని దారుణ అత్యాచారం, హత్యపై దేశమంతటా ఆగ్రహ జ్వాల వెల్లువెత్తుతోంది. హంతకున్ని ఉరితీయాలంటూ వైద్యులతో సహా ప్రజాసంఘాలు ముమ్మరంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో సిలికాన్‌ నగరంలో మరో ఘోరం చోటుచేసుకుంది. యువతిపై ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బొమ్మనహళ్ళిలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ సంఘటన చోటుచేసుకుంది.

కారులో వస్తుండగా..
బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ పట్టణం వద్దనున్న ఓ ప్రైవేటు కళాశాల్లో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న యువతిపై లైంగిక దాడి జరిగింది. శనివారం రాత్రి ఆమె స్నేహితులతో కలిసి కోరమంగళలో ఉన్న పబ్‌కు వెళ్లింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో స్నేహితునితో కలిసి కారులో ఇంటికి బయల్దేరింది. కోరమంగళలో కారు అదుపు తప్పి ఓ ఆటోను కొట్టింది. దీంతో ఆటోలోని వారు కారులో ఉన్న యువతీ యువకునితో గొడవ పడ్డారు. తరువాత యువతి పోలీసులకు ఫోన్‌ చేయడంతో ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యువతి నడుచుకుంటూ ముందుకు వెళ్లింది. ఓ బైకిస్టు కనిపించడంతో ఆమె లిఫ్టు అడగడంతో అతడు సరేనని తీసుకెళ్లాడు. బొమ్మనహళ్ళి సమీపంలోని నిర్జన ప్రాంతంలోకి యువతిని తీసుకెళ్లడంతో యువతి గట్టిగా ప్రశ్నించడంతో కొట్టాడు. ఆపై అత్యాచారం చేసి పారిపోయాడు. యువతి తన మొబైల్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ను నొక్కడంతో జీపీఎస్‌ ద్వారా యువతి స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. స్పృహ తప్పి పడిపోయిన యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

5 బృందాలతో గాలింపు
విషయం తెలుసుకున్న హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతిపైన అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. దుండగుడు ఒక్కడేనని నగర ఉత్తర విభాగం అదనపు పోలిసు కమిషనర్‌ రమణగుప్త తెలిపారు. నిందితుని గాలింపునకు 5 బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement