మెడికల్ సీటు పేరుతో రూ.1.5 కోట్లు వసూలు
దొడ్డబళ్లాపురం: మెడికల్ సీటు ఇప్పిస్తానని వ్యాపారవేత్త వద్ద రూ.1.5 కోట్లు వసూలు చేసిన ఇద్దరు నిందితులను బ్యాడరహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. మంజప్ప, విరూపాక్షప్ప అరైస్టెన నిందితులు. ప్రదీప్ భాస్కర్ పౌల్ అనే వ్యాపారవేత్త కుమార్తెకు ప్రముఖ మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామని నమ్మంచి రూ.1.5 కోట్లు తీసుకున్నారు. ఎన్ని రోజులైనా సీటు ఇప్పించక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.
దర్శన్‌కు రాచమర్యాదలపై మధ్యంతర నివేదిక అందజేత
బనశంకరి: పరప్పన అగ్రహారజైలులో నటుడు దర్శన్, విల్సన్‌గార్డెన్ నాగా, ఇతరులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఆగ్నేయ విభాగ డీసీపీ సారా.ఫాతీమా మధ్యంతర నివేదికను శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్‌కు అందజేశారు. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చటిస్తున్నట్లు ఫొటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం స్పందించింది. . రాచమర్యాదల ఘటనపై పరప్పన అగ్రహరపోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. డబ్బు ఆశకు లోనై జైలులో కొందరు అధికారులు, సిబ్బంది రాచమర్యాదలు ఇచ్చారని దర్యాప్తులో వెలుగుచూసినటు తెలిసింది.
ఈడీ దాడులు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో నివసిస్తున్న పలువురు జాతీయ బ్యాంక్ ఉద్యోగుల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. ఢిల్లీలో నమోదైన ఒక ఈడీ కేసుకు సంబంధిచి బెంగళూరులో ఐదు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. సంబంధిత ఉద్యోగుల ఇళ్లల్లో ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ దాడులు ఏ కేసుకు సంబంధించి చేశారనేది తెలియాల్సి ఉంది.
త్వరలో మెట్రో రైలు చార్జీల పెంపు?
శివాజీనగర: నమ్మ మెట్రో రైలు ప్రయాణ ధర పెంచేందుకు బెంగళూరు మెట్రో రైలు మండలి (బీఎంఆర్‌సీఎల్) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రయాణ ధర పెంపుపై ప్రజలనుంచి అభిప్రాయాలు కోరుతూ బహిరంగ ప్రకటన చేసింది. ఈ నెల 21లోగా సలహాలను ఈ మెయిల్ ద్వారా పంపించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రయాణ ధరపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణ ధర కనిష్టం రూ.10, గరిష్టంగా రూ.60 ఉంది. స్మార్ట్ కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్‌లను వినియోగించే ప్రయాణికులకు 5 శాతం రాయితీ కల్పిస్తున్నారు. బీఎంఆర్‌సీఎల్ మార్గాల విస్తరణతో ఖర్చులు పెరుగుతున్నాయి. రుణాలను చెల్లించేందుకు చార్జీల ధర పెంపు ఒకటే మార్గమని బీఎంఆర్‌సీఎల్ అధికారులు అంటున్నారు. మెట్రో రైల్వే స్టేషన్లలో పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలను నివారించేందుకు ప్లాట్‌ఫారం స్క్రీన్ ఏర్పాటుకు రూ. 700 కోట్ల నుంచి రూ. 800 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును కూడా భరించేందుకు టికెట్ల ధర పెంచడమే మార్గమని బీఎంఆర్‌సీఎల్ భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment