మద్యం మత్తులో వైద్యుడు.. యువతికి ఐదు ఇంజెక్షన్లు
బనశంకరి: పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతమిది. మద్యం మత్తులో ఉన్న డాక్టర్, నర్సు యువతికి 5 సార్లు ఇంజెక్షన్ వేసిన ఘటన నగరంలో కుమారస్వామి లేఔట్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో వెలుగు చూసింది. వివరాలు.. ఈ నెల 3వ తేదీన జ్వరంతో యువతి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న డాక్టర్ ప్రదీప్, మేల్ నర్సు మహేంద్ర.. యువతి చేయి పట్టుకుని ఇంజెక్షన్ వేశారు. తరువాత డాక్టర్ ప్రదీప్ యువతికి మరో ఇంజెక్షన్ వేశాడు. ఇలా 5 సార్లు యువతికి సూది మందు ఇచ్చారు. చేతులు, నడుముపైన పదే పదే ఇంజెక్షన్లు వేయడంతో యువతి బాధతో విలవిలలాడిది. డాక్టర్ వద్ద మద్యం వాసన రావడంతో యువతి గట్టిగా ప్రశ్నించడంతో వైద్యుడు అక్కడి నుంచి ఉడాయించాడు. యువతితో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతి తల్లిదండ్రులు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘరానా డాక్టర్‌పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment