శివాజీనగర: బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి.. మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను అసభ్యంగా దూషించారనే కేసులో అసెంబ్లీలో పోలీసులు విచారణ (మహజర్)కు రాగా, పరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి అంగీకరించలేదు. మహజర్ చేయరాదని పోలీసులకు సూచించానని చెప్పారు. సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, శాసనసభ విషయంలో పోలీసులు తల దూర్చేందుకు వీల్లేదు. ఆ అధికారం, హక్కు పోలీసులకు లేదని అన్నారు. పోలీసులు మహజర్‌కు వస్తే, అలా రాకూడదని చెప్పానన్నారు. అసెంబ్లీలో వ్యవహారాలపై వారు జోక్యం చేసుకుంటే ఆ పోలీసులపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. విధాన పరిషత్ లోపల జరిగిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ వేశారు. అలా వేయటానికి కుదరదు. దీనికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తప్పవు అని చెప్పారు.
ఏ సాక్ష్యాలు లేవు
పరిషత్ సభ్యుడు సీటీ రవి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌పై అసభ్య వ్యాఖ్యలు చేశారనేందుకు వీడియో, ఆడియో ఆధారాలు లేవు. సభ వాయిదా పడిన తరువాత వీడియో, ఆడియో రికార్డు చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఆ ఆధారాలను పంపితే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్ష చేయిస్తాము. అలాగే రవి కేసును నైతిక కమిటీకి ఇచ్చేందుకు వీలు లేదు. నేను సభలో కూడా రూలింగ్ చేశాను. ప్రస్తుతం ఇది ముగిసిపోయిన అధ్యాయం అని స్పష్టం చేశారు.
సీటీ రవి కేసులో పరిషత్ సభాపతి
Comments
Please login to add a commentAdd a comment